Header Banner

కెరీర్‌కు కిక్ స్టార్ట్ ఇచ్చే పాలిటెక్నిక్‌ కోర్సులు.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి! ఉచిత శిక్షణతో అరుదైన అవకాశం!

  Sat Apr 05, 2025 09:07        Education

కెరీర్‌లో త్వరగా స్థిరపడాలనుకునే యువతకు పాలిటెక్నిక్‌ కోర్సులకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. 2025-26 సంవత్సరానికి పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చేరికకు ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు ముగియడంతో పాలిసెట్‌ 2025కు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రవేశపరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా నచ్చిన బ్రాంచిలో చేరే అవకాశం ఉంటుంది. డిప్లొమా పూర్తికాగానే వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు వెంటనే లభిస్తాయి. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్‌ 15, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 30న ప్రవేశ పరీక్ష జరుగుతుంది. బయోమెడికల్‌, డీ ఫార్మసీ, మెకానికల్‌, ఈఈఈ, ఈసీఈ, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, సీసీపీ, డీసీఈ, డీఎంఈ తదితర డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్‌ మూడు సంవత్సరాలు కోర్సు పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. పదో తరగతి తరువాత తక్కువ కాలంలో కేవలం పాలిటెక్నిక్‌ కోర్సులతోనే కెరీర్‌లో స్థిరపడొచ్ఛు పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్‌ రెండునుంచి ఉచితశిక్షణ, ఉచిత మెటీరియల్‌ ఇస్తామని పాలిసెట్‌ నెల్లూరు జిల్లా కన్వీనర్‌ ఏసుదాస్‌ తెలిపారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!


పాలిసెట్‌కు దరఖాస్తులు చేసుకుంటున్న విద్యార్థుల సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరంలోని దర్గామిట్టలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో 99123 42048, వెంకటేశ్వరపురంలోని బాలుర పాలిటెక్నిక్‌ కళాశాలలో 99123 42016 నంబర్లు ఏర్పాటు చేశారు. కావలి, ఆత్మకూరు, కందుకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారుల్లో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీలు రూ.100 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. ఎచ్చెర్ల మండలం కుశాలపురంలోని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏప్రిల్‌ 3 నుంచి పాలీసెట్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు స్థానిక పాలిటెక్నిక్‌ అధ్యాపకులు ప్రవేశ పరీక్షలో రాణించేలా వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణకు హాజరైన విద్యార్థులకు ఉచిత మెటీరియల్‌ కూడా అందజేస్తారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Polytechnic2025 #CareerKickstart #POLYCET #FreeCoaching #SkillBasedEducation